Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒబామాను హత్య చేసేందుకు యత్నించిన మహిళ అరెస్టు!

  • బరాక్ ఒబామాతో పాటు టెక్సాస్ గవర్నర్ గ్రేగ్ అబోట్‌ పై మహిళ హత్యాయత్నం
  • బాంబులను పార్సిళ్లలో ప్యాక్ చేసి పంపిన జూలియా ఫోఫ్
  • కొరియర్ ఆఫీసు సీసీ పుటేజ్ సాక్ష్యంతో జూలియా ఆరెస్టు
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పాటు టెక్సాస్ గవర్నర్ గ్రేగ్ అబోట్‌ ను చంపేందుకు ప్రయత్నించిందని చెబుతూ జూలియా ఫోఫ్ (46) అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కలకలం రేగింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే... ఒబామా, అబోట్ లకు పార్సిళ్లు వచ్చాయి. ఆ పార్సిల్స్ అందుకున్న భద్రతా సిబ్బంది, వాటిని బాంబులుగా గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది.

దీంతో ఆ పార్సిల్స్ ఎలా వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? వంటి వివరాలపై దర్యాప్తు చేయగా కొరియర్ కంపెనీ సీసీ పుటేజ్ లో జూలియా ఫోఫ్ ఈ పార్సిల్స్ పంపిందని తేలింది. వారిద్దరినీ హతమార్చేందుకు పార్సిళ్లలో బాంబులు ప్యాక్ చేసి పంపిందని తేలింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇది టెక్సాస్ లో కలకలం రేపింది. 
barak obama
julia fope
Assassination attempt
Arrested

More Telugu News